Shoaib Akhtar: ఇది బుర్ర లేని జట్టు..షోయబ్ అక్తర్ 1 y ago

featured-image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. ప్రస్తుత పాకిస్థాన్ బుర్ర లేని జట్టు అని అతననన్నాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన కోహ్లిపై అక్తర్ ప్రశంసలు కురిపించాడు.

"పాక్తో మ్యాచ్ ఆడాలని చెప్పినప్పుడు కోహ్లి సన్నద్ధతతో వచ్చి సెంచరీ సాధిస్తాడు. కోహ్లికి హ్యాట్సాఫ్. అతనో సూపర్ స్టార్. తెల్ల బంతి క్రికెట్ లక్ష్య ఛేదనలో ఎదురులేని మొనగాడు. ఆధునిక క్రికెట్లో గొప్ప ఆటగాడు. అతను నిజాయతీ కలిగిన వ్యక్తి. 14,000 పరుగులు మైలురాయిని అధిగమించాడు. అతను 100 సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. ఇక భారత్ చేతిలో పాక్ ఓటమితో నేను నిరాశ చెందలేదు. ఏం జరుగుతుందో నాకు ముందే తెలుసు. ప్రపంచమంతా ఆరుగురు బౌలర్లతో ఆడుతుంటే పాక్ అయిదుగురిని ఎంపిక చేయలేదా? బౌలర్లకు బదులుగా ఇద్దరు ఆల్రౌండర్లతో ఆడటం బుర్ర లేని, అర్థరహిత నిర్ణయం. దీనికి ఆటగాళ్లను మాత్రమే నిందించలేం. వాళ్లు కూడా జట్టు మేనేజ్మెంట్ మాదిరే తెలివి తక్కువాళ్లు. ఏం చేయాలో వారికి తెలియదు. రోహిత్, కోహ్లి, గిల్ మాదిరిగా వారిలో నైపుణ్యాలు లేవు. దిశానిర్దేశం లేకుండానే ఆడేందుకు వెళ్లారు" అని అక్తర్ పేర్కొన్నాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD